Menu

UPSC డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ – 10th సెప్టెంబర్ 2026

ప్రశ్న. జాతీయ విద్యా విధానం (NEP), 2020 లక్ష్యాలను పాఠశాల స్థాయి ఫలితాలుగా మార్చడానికి పీఎం శ్రీ (PM SHRI) పథకం ఎలా సహాయపడుతుంది? భారతదేశ పాఠశాల విద్యా వ్యవస్థ అంతటా దీని ప్రయోజనాలను విస్తరించడంలో ఉన్న సవాళ్లను పరిశీలించండి.

Q. How does the PM SHRI scheme seek to translate the vision of the National Education Policy, 2020 into school-level outcomes? Examine the challenges in extending its benefits across India’s school education system.

పరిచయం

14,500 కు పైగా పాఠశాలలను ‘ఆదర్శ పాఠశాలలు’ (Exemplar institutions) గా బలోపేతం చేసే లక్ష్యంతో 2022 లో ‘ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా’ (PM SHRI) పథకాన్ని ప్రారంభించారు. ₹27,360 కోట్ల కేటాయింపుతో, NEP 2020 అభ్యాసం (Learning), సమ్మిళితం (Inclusion), పాఠశాల పాలనను ఎలా మెరుగుపరుస్తుందో నిరూపించడానికి ఇది ప్రయత్నిస్తుంది.

ప్రధాన భాగం

NEP 2020 ని ఆచరణలో పెట్టడం (Translating NEP 2020 into Practice)

  • అభ్యాసకుల (విద్యార్థి)-కేంద్రీకృత విద్య: అనుభవపూర్వక కార్యకలాపాలు, పరిశోధన-ఆధారిత బోధన (Inquiry-based teaching), బ్యాగ్-లెస్ (పుస్తకాల బ్యాగ్ లేని) రోజులు, చేతివృత్తుల వారి వద్ద ఇంటర్న్‌షిప్‌లు వంటివి విద్యార్థులలో అవగాహనను, ప్రాక్టికల్ అనుభవాన్ని (ఆచరణాత్మక అప్లికేషన్‌ను) ప్రోత్సహిస్తాయి. ఈ పాఠ్యప్రణాళిక 5+3+3+4 విధానాన్ని అనుసరిస్తుంది.
  • సమానత్వం, బహుభాషా విధానం: అందరికీ అందుబాటులో ఉండే మౌలిక సదుపాయాలు (Accessible infrastructure), విభిన్న అభ్యాస సామర్థ్యాలకు మద్దతు ఇవ్వడం, ప్రారంభ దశలో స్థానిక భాషలలో బోధన.. విద్యార్థుల భాగస్వామ్యాన్ని, పునాది అభ్యాసాన్ని బలోపేతం చేస్తాయి.
  • డిజిటల్, సమగ్ర అభ్యాసం: ICT (సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ) సదుపాయాలు, దీక్ష (DIKSHA), స్టెమ్ (STEM) కార్యకలాపాలు, క్రీడలు, కళలు.. డిజిటల్ అక్షరాస్యతను, సృజనాత్మకతను, సామాజిక-భావోద్వేగ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి.
  • ఉపాధ్యాయుల అభివృద్ధి: డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. ఇది వారి బోధనా నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను, కౌన్సెలింగ్, టెక్నాలజీ వినియోగాన్ని బలోపేతం చేస్తుంది.
  • సుస్థిరత, నాణ్యత: ‘గ్రీన్-స్కూల్’ విధానాలు (పర్యావరణ అనుకూల విధానాలు) పర్యావరణ బాధ్యతను ప్రోత్సహిస్తాయి. ‘స్కూల్ క్వాలిటీ అసెస్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్’ (School Quality Assessment Framework) పాఠశాల నాణ్యతను పర్యవేక్షించడంలో మద్దతు ఇస్తుంది.
  • వ్యవస్థాగత మెరుగుదల (Systemic Improvement): సమర్థవంతమైన విధానాలను పంచుకోవడం ద్వారా చుట్టుపక్కల పాఠశాలలకు కూడా మార్గనిర్దేశం చేయాలని ఎంపిక చేసిన పాఠశాలల నుంచి ఆశిస్తున్నారు.

విస్తృత అమలులో ఉన్న సవాళ్లు (Challenges in Wider Implementation)

  • ప్రారంభ పరిస్థితుల్లో అసమానత: ప్రతికూల పరిస్థితుల్లో (వెనుకబడి) ఉన్న పాఠశాలలకు సన్నాహక (ప్రిపరేటరీ) మద్దతు ఇవ్వకపోతే.. సవాళ్ల-ఆధారిత ఎంపిక (Challenge-based selection) అనేది ఇప్పటికే మెరుగ్గా ఉన్న పాఠశాలలకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చవచ్చు.
  • సామర్థ్య పరిమితులు: ఉపాధ్యాయుల కొరత, శిక్షణ నాణ్యతలో అసమానతలు తరగతి గదిలో అమలును బలహీనపరుస్తాయి.
  • డిజిటల్ డివైడ్ (Digital Divide): ఇంటర్నెట్ కనెక్టివిటీ, నిర్వహణ (మెయింటెనెన్స్), ఉపాధ్యాయుల సంసిద్ధత లేకుండా కేవలం పరికరాలు మాత్రమే ఉంటే విద్యార్థులు అర్థవంతంగా నేర్చుకోలేరు.
  • పరిమిత విస్తరణ (Limited Spillovers): మార్గదర్శకత్వం చేయడానికి తగిన సిబ్బంది, ప్రోత్సాహకాలు, జవాబుదారీతనం లేకపోతే ఈ ఆదర్శ పాఠశాలలు కేవలం వివిక్త (ఒంటరి) విజయాలుగా మాత్రమే మిగిలిపోతాయి. చుట్టుపక్కల పాఠశాలలకు ఆ విజయాలు చేరవు.

ముందుచూపు (Way Forward)

  • మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయడంతో పాటు ఉపాధ్యాయులకు నిరంతర మద్దతు, నిర్వహణ (Maintenance) కు ప్రాధాన్యత ఇవ్వాలి.
  • అభ్యాస ఫలితాలు (Learning outcomes), సమ్మిళితం (Inclusion), విద్యార్థుల శ్రేయస్సు (Student well-being) ద్వారా పురోగతిని అంచనా వేయాలి.
  • వెనుకబడిన పాఠశాలలకు అదనపు సహాయం అందించాలి. సమాజం (కమ్యూనిటీ) పర్యవేక్షణను బలోపేతం చేయాలి.
  • మార్గదర్శక బాధ్యతలు, సమీక్షా యంత్రాంగాలతో పాఠశాలల సమూహాలను (స్కూల్ క్లస్టర్లను) సంస్థాగతీకరించాలి (Institutionalise).

ముగింపు

పీఎం శ్రీ (PM SHRI) పథకం సమర్థవంతమైన పాఠశాల సంస్కరణను ప్రదర్శించగలదు, కానీ ఈ పథకం సాధించే విజయాలను ఎంపిక చేసిన పాఠశాలలకు మించి ఇతర పాఠశాలలకు బదిలీ చేయడం (విస్తరించడం) పైనే మొత్తం విద్యా వ్యవస్థ విజయం ఆధారపడి ఉంటుంది. సమానమైన, నాణ్యతతో కూడిన విద్యను సాధించడానికి సహకార సమాఖ్య (Cooperative federalism), సమర్థులైన ఉపాధ్యాయులు, ఫలితాల ఆధారిత జవాబుదారీతనం చాలా అవసరం

ప్రశ్న. “సమర్థవంతమైన వాతావరణ పాలనకు వాతావరణ చర్యల స్థానికీకరణ అవసరం.” గ్రామీణ వాతావరణ స్థిరత్వాన్ని నిర్మించడంలో గ్రామ పంచాయతీల పాత్రను చర్చించండి. అవి ఎదుర్కొంటున్న సవాళ్లను పరిశీలించి, వాటి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి తగిన చర్యలను సూచించండి.

Q. “Effective climate governance requires the localisation of climate action.” Discuss the role of Gram Panchayats in building rural climate resilience. Examine the challenges they face and suggest measures to strengthen their capacity.

పరిచయం

భౌగోళిక పరిస్థితులు, జీవనోపాధి, సహజ వనరుల ఆధారంగా వాతావరణ ప్రమాదాలు ఒక్కో గ్రామంలో ఒక్కోలా ఉంటాయి. అందువల్ల జాతీయ, రాష్ట్ర స్థాయి విధానాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని అమలు చేయాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యంతో కూడిన ప్రణాళికల ద్వారా, వాతావరణ లక్ష్యాలను రోజువారీ అభివృద్ధి అవసరాలతో అనుసంధానించడంలో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి.

ప్రధాన భాగం

గ్రామ పంచాయతీల పాత్ర (Role of Gram Panchayats)

  • స్థానికీకరించిన అనుసరణ (Localised Adaptation): కరువు పీడిత గ్రామాలలో భూగర్భ జలాల రీఛార్జ్ (పెంపుదల), పంటల వైవిధ్యానికి పంచాయతీలు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అదే సమయంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలను రక్షించడంపై దృష్టి పెట్టవచ్చు.
  • అభివృద్ధి అనుసంధానం: వాతావరణ ప్రాధాన్యతలను ‘గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో (GPDPs)’ చేర్చడం వల్ల.. వ్యవసాయం, నీరు, సమాజ ఆస్తుల (Community assets) పై చేసే సాధారణ వ్యయం వాతావరణ-అనుకూల వ్యయంగా మారుతుంది.
  • రాజ్యాంగ పునాది (Constitutional Foundation): అభివృద్ధి బాధ్యతలను స్థానిక సంస్థలకు బదిలీ చేయడానికి ఆర్టికల్ 243G రాష్ట్ర శాసనసభలకు అధికారం ఇస్తుంది. వ్యవసాయం, నీటి నిర్వహణ, అటవీ సంరక్షణ వంటి ‘పదకొండవ షెడ్యూల్ (Eleventh Schedule)’ లోని అంశాలు వాతావరణ చర్యలకు ఆస్కారం కల్పిస్తాయి.
  • ప్రజల భాగస్వామ్యం: గ్రామ సభలు తమ సాంప్రదాయ జ్ఞానాన్ని శాస్త్రీయ అంచనాలతో (Scientific assessments) కలపగలవు. షెడ్యూల్డ్ ప్రాంతాలలో (Scheduled Areas) కమ్యూనిటీ వనరుల రక్షణకు 1996 నాటి PESA చట్టం (పంచాయతీ రాజ్ చట్టం – షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరణ) మరింత మద్దతు ఇస్తుంది.
  • స్థానిక ఉపశమనం (Local Mitigation): పునరుత్పాదక శక్తి, అడవుల పెంపకం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ ద్వారా ఉద్గారాలను (కార్బన్ ఎమిషన్స్) తగ్గించవచ్చు. బేలా గ్రామ పంచాయతీ (Bela Gram Panchayat) చేపట్టిన చెట్ల పెంపకం, సోలార్ ఇన్‌స్టాలేషన్‌లు (సౌర ఫలకాల ఏర్పాటు), వ్యర్థాల విభజన ఈ సామర్థ్యాన్ని వివరిస్తాయి.

సవాళ్లు (Challenges)

  • సామర్థ్య లోపం: పరిమితమైన సాంకేతిక నైపుణ్యం వల్ల ప్రమాదాల అంచనా (Vulnerability assessment), ప్రాజెక్ట్ డిజైనింగ్ కష్టమవుతున్నాయి.
  • డేటా లోపాలు: వర్షపాతం, భూగర్భ జలాలు, ప్రమాదానికి గురయ్యే అవకాశమున్న కుటుంబాల గురించి గ్రామ స్థాయిలో తగినంత సమాచారం లేకపోవడం ప్రణాళికలను బలహీనపరుస్తుంది.
  • ఆర్థిక పరిమితులు: పంచాయతీల సొంత నిర్ణయాలతో ఖర్చు చేయడానికి తగినన్ని నిధులు లేకపోవడం (Limited discretionary funds), వివిధ పథకాల అమలులో ఏకీకృత విధానం లోపించడం (Fragmented implementation) వల్ల స్థానిక ప్రాధాన్యతలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
  • బలహీనమైన జవాబుదారీతనం: పరిపాలనా ప్రణాళికల్లో ప్రజల అర్థవంతమైన భాగస్వామ్యం, కొలవగల లక్ష్యాలు, క్రమం తప్పని సమీక్షలు లోపించవచ్చు.

ముందుచూపు (Way Forward)

  • అధికారాల బదిలీని బలోపేతం చేయాలి: జిల్లా స్థాయి సాంకేతిక సహాయంతో పాటు తగినన్ని నిధులు, విధులు, సిబ్బందిని (Functionaries) పంచాయతీలకు అందించాలి.
  • వాతావరణ ప్రణాళికల సంస్థాగతీకరణ: ప్రమాదాల అంచనాలను ‘గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల్లో (GPDPs)’ చేర్చాలి. వాటిని రాష్ట్ర వాతావరణ వ్యూహాలతో అనుసంధానించాలి.
  • కలయికను ప్రోత్సహించాలి (Promote Convergence): స్థానికంగా స్థిరత్వాన్ని (Resilience) సాధించే లక్ష్యంతో నీటిపారుదల, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి పథకాలను సమన్వయం చేయాలి.
  • భాగస్వామ్య పర్యవేక్షణను నిర్ధారించాలి: గ్రామసభల పర్యవేక్షణను ఎనేబుల్ చేయాలి. నీటి భద్రత, జీవనోపాధి, మౌలిక సదుపాయాల స్థిరత్వంలో వచ్చే మెరుగుదలను ఎప్పటికప్పుడు అంచనా వేయాలి.

ముగింపు

అధికారాలున్న పంచాయతీలు మాత్రమే వాతావరణ పాలనను ప్రతిస్పందించేలా, సమ్మిళితంగా (అందరినీ కలుపుకుపోయేలా), జవాబుదారీతనంతో ఉండేలా చేయగలవు. ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా, వాతావరణ మార్పులపై జాతీయ స్థాయి కట్టుబాట్లను.. గ్రామీణ మనుగడ (Resilience), సుస్థిరాభివృద్ధితో కూడిన ఆచరణాత్మక ఫలితాలుగా మార్చవచ్చు

Enroll Now for Unlimited UPSC Utsav

Start Date

22/03/2026

Timings

08 AM – 4 PM

    Scroll to Top