var breakpoints = [{"label":"Desktop","slug":"Desktop","value":"base","direction":"max","isActive":true,"isRequired":true},{"label":"Tablet","slug":"Tablet","value":"1024","direction":"max","isActive":true,"isRequired":true},{"label":"Mobile","slug":"Mobile","value":"767","direction":"max","isActive":true,"isRequired":true}];
ప్రశ్న: పశ్చిమ విక్షోభాలు (Western Disturbances), ఎల్ నినో (El Niño), వడగాల్పులు (Heatwaves) వంటి వాతావరణ పరిణామాలు భారతదేశ వాతావరణ పరిస్థితులను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. వ్యవసాయం, ప్రజారోగ్యం, విపత్తు నిర్వహణపై వాటి ప్రభావాన్ని చర్చించండి.
Q. Climate phenomena such as Western Disturbances, El Niño and heatwaves are increasingly influencing India’s weather patterns. Discuss their impact on agriculture, public health and disaster management.
(GS Paper I: Geography – Physical Geography – Climate phenomena – Western Disturbances, El Niño and heatwaves)
పరిచయం
భారతదేశ వాతావరణాన్ని పశ్చిమ విక్షోభాలు (Western Disturbances), ఈఎన్‌ఎస్‌ఓ (ENSO), ఎల్ నినో, లా నినా (La Niña), వడగాల్పులు వంటి వాతావరణ పరిణామాలు ప్రభావితం చేస్తాయి. ఈ పరిణామాలు వర్షపాతం, ఉష్ణోగ్రత, రుతుపవనాల ప్రవర్తన (Monsoon behaviour), తీవ్రమైన వాతావరణ సంఘటనలను మారుస్తాయి. వ్యవసాయం, నీటి వనరులు, జీవనోపాధి నేరుగా వాతావరణంతో ముడిపడి ఉన్న భారతదేశం లాంటి దేశానికి వీటి ప్రభావం చాలా ముఖ్యం.
ప్రధాన భాగం
వ్యవసాయంపై ప్రభావం (Impact on Agriculture)
ఎల్ నినో (El Niño) నైరుతి రుతుపవనాలను (Southwest monsoon) బలహీనపరుస్తుంది. దీనివల్ల ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుంది.
వర్షపాతం తగ్గితే నేలలో తేమ (Soil moisture) తగ్గిపోతుంది. వరి, పప్పుధాన్యాలు, పత్తి, నూనెగింజలు లాంటి పంటలను ఇది దెబ్బతీస్తుంది.
పశ్చిమ విక్షోభాలు ఉత్తర భారతదేశంలో చలికాలంలో వర్షాలను కురిపిస్తాయి. ఈ వర్షాలు గోధుమ లాంటి రబీ పంటలకు (Rabi crops) చాలా ఉపయోగపడతాయి.
కానీ ఇవి బలంగా లేదా అకాలంగా (Unseasonal) వస్తే వడగళ్లు కురుస్తాయి. దీనివల్ల పంట నష్టం జరుగుతుంది.
వడగాల్పుల వల్ల డీహైడ్రేషన్ (Dehydration), వడదెబ్బ (Heatstroke), తీవ్రమైన అలసట వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
గాలిలో తేమ (Humidity) ఎక్కువగా ఉంటే వెట్ బల్బ్ ఉష్ణోగ్రత (Wet bulb temperature) పెరుగుతుంది. అప్పుడు చెమట ద్వారా శరీరం తనను తాను చల్లబరుచుకోవడం కష్టంగా మారుతుంది.
ఆరుబయట పనిచేసే కార్మికులు, వృద్ధులు, చిన్నపిల్లలు, రోగులపై ఈ వాతావరణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ (Urban heat island effect) కారణంగా పట్టణ ప్రాంతాలు మరింత తీవ్రమైన ఉష్ణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి.
అధిక ఉష్ణోగ్రతలు తాగునీరు, విద్యుత్ డిమాండ్‌ను కూడా పెంచుతాయి.
విపత్తు నిర్వహణపై ప్రభావం (Impact on Disaster Management)
తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడానికి బలమైన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు (Early warning systems) కావాలి. అలాగే స్థానికంగా తగిన సన్నద్ధత (Local preparedness) అవసరం.
వడగాల్పులను ఎదుర్కోవడానికి జిల్లా స్థాయిలో హీట్ యాక్షన్ ప్లాన్‌లను (Heat Action Plans) తయారు చేయాలి.
పశ్చిమ విక్షోభాల వల్ల అకాల వర్షాలు కురుస్తాయి. ఇవి స్థానికంగా వరదలు తీసుకువస్తాయి. పంట నష్టాన్ని, రవాణా అంతరాయాన్ని కలగజేస్తాయి.
ఎల్ నినో సంవత్సరాల్లో రుతుపవనాలు బలహీనపడతాయి. దీనివల్ల కరువు ప్రమాదం (Drought risk) పెరుగుతుంది.
విపత్తు నిర్వహణ సంస్థలు.. వాతావరణ శాఖ (IMD), ఆరోగ్య శాఖలు, స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ కలిసి పనిచేయాలి.
ముందున్న మార్గం (Way Forward)
వాతావరణ శాఖ (IMD) ద్వారా స్థానిక వాతావరణ సూచనలు, ముందస్తు హెచ్చరికలను బలోపేతం చేయాలి.
ప్రమాదం పొంచి ఉన్న జిల్లాల కోసం హీట్ యాక్షన్ ప్లాన్‌లను సిద్ధం చేయాలి. పరిస్థితులకు తగ్గట్లుగా వాటిని అప్‌డేట్ చేయాలి.
వాతావరణ మార్పులను తట్టుకునే పంటలను (Climate-resilient crops) ప్రోత్సహించాలి. నీటి పారుదల వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించాలి.
ఆరుబయట పనిచేసే కార్మికులకు నీడ, తాగునీరు అందించాలి. మధ్యలో విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించాలి.
పట్టణాల్లో పచ్చదనాన్ని (Green cover) పెంచాలి. ఇళ్ల పైకప్పులను చల్లగా ఉంచే కూల్-రూఫ్ (Cool-roof) పద్ధతులను అమలు చేయాలి.
విపత్తు నిర్వహణ సంస్థలు, వ్యవసాయ శాఖలు, స్థానిక ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలి.
ముగింపు
పశ్చిమ విక్షోభాలు, ఎల్ నినో, వడగాల్పులు వంటి వాతావరణ పరిణామాలు ఇప్పుడు కేవలం శాస్త్రీయ పదాలు మాత్రమే కావు. ఇవి భారతదేశ వ్యవసాయం, ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ, విపత్తు సన్నద్ధతను నేరుగా ప్రభావితం చేస్తాయి. వాతావరణ సూచనలు (Forecasting), అవగాహన, అనుకూలత (Adaptation), స్థానిక ప్రణాళిక ఆధారంగా వాతావరణాన్ని తట్టుకునే విధానాన్ని (Climate-resilient approach) మనం అవలంబించాలి. ఇలా చేస్తే ప్రమాదాలను తగ్గించవచ్చు. అలాగే వాతావరణ మార్పుల బారిన పడే ప్రమాదం ఉన్న వర్గాలను రక్షించవచ్చు.
ప్రశ్న: రైతుల ఆదాయాన్ని పెంచడంలో, భారతదేశ వస్త్ర విలువ గొలుసును (Textile value chain) బలోపేతం చేయడంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (Mission for Cotton Productivity) కీలక పాత్ర పోషిస్తుంది. చర్చించండి.
Q. The Mission for Cotton Productivity can play a crucial role in improving farmer income and strengthening India’s textile value chain. Discuss. (GS Paper III: Agriculture, Cropping Patterns, Inclusive Growth, Industrial Growth)
(జనరల్ స్టడీస్ పేపర్ III: వ్యవసాయం, పంటల సరళి (Cropping Patterns), సమ్మిళిత వృద్ధి (Inclusive Growth), పారిశ్రామిక వృద్ధి (Industrial Growth))
పరిచయం
భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన వాణిజ్య పంటలలో (Commercial crops) పత్తి ఒకటి. ఇది మన వస్త్ర పరిశ్రమకు (Textile industry) వెన్నెముక లాంటిది. ప్రపంచంలోనే అత్యధిక విస్తీర్ణంలో పత్తిని మన దేశం సాగు చేస్తోంది. కానీ, ప్రపంచంలోని అగ్రగామి దేశాలతో పోలిస్తే మన పత్తి దిగుబడి (Productivity) తక్కువగా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం 2025–26 కేంద్ర బడ్జెట్లో ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఐదేళ్ల పాటు అమలు చేసే ఈ చొరవకు మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ అని పేరు పెట్టారు.
ప్రధాన భాగం
మిషన్ ప్రాముఖ్యత
1. పత్తి దిగుబడిని పెంచడం (Improving Cotton Productivity)
ప్రపంచ పత్తి సాగు విస్తీర్ణంలో దాదాపు 40% మన దేశంలోనే ఉంది. అయినా మన దేశం దిగుబడిలో చాలా వెనుకబడి ఉంది. అందుకే అధిక దిగుబడినిచ్చే రకాలను, తెగుళ్లను తట్టుకునే రకాలను (Pest-resistant varieties) ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వాతావరణ మార్పులను తట్టుకునే (Climate-smart) పత్తి రకాలను పరిచయం చేసి దిగుబడిని పెంచాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది.
2. రైతుల ఆదాయానికి మద్దతు ఇవ్వడం
అధిక దిగుబడితో పాటు మెరుగైన నాణ్యత కలిగిన పత్తి (Fibre quality) వస్తే రైతుల లాభాలు పెరుగుతాయి. గులాబీ రంగు పురుగు (Pink bollworm) లాంటి తెగుళ్ల వల్ల జరిగే పంట నష్టాలను కూడా ఈ మిషన్ తగ్గిస్తుంది.
3. వస్త్ర విలువ గొలుసును బలోపేతం చేయడం (Strengthening Textile Value Chain)
ఇది పత్తి రైతులు, వస్త్ర పరిశ్రమలు, ఎగుమతి మార్కెట్ల (Export markets) మధ్య మెరుగైన అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది.
4. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం
ఇటీవలి కాలంలో మన దేశం పత్తి దిగుమతులను (Imports) పెంచింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచితే మనం విదేశాల మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. దీనివల్ల దేశం స్వయం సమృద్ధి (Self-reliance) సాధిస్తుంది.
5. ఎగుమతి పోటీతత్వాన్ని పెంచడం (Promoting Export Competitiveness)
పొడవైన పత్తి గింజల రకాలపై (Extra Long Staple cotton) ప్రభుత్వం దృష్టి పెట్టింది. నాణ్యతను పరీక్షించడం, కస్తూరి కాటన్ ఇండియా (Kasturi Cotton India) ద్వారా బ్రాండింగ్ చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. ఇవి ప్రపంచ వస్త్ర మార్కెట్లలో భారతదేశ స్థానాన్ని మెరుగుపరుస్తాయి.
సవాళ్లు
అమెరికా, చైనా, బ్రెజిల్ దేశాలతో పోలిస్తే మన దిగుబడి చాలా తక్కువగా ఉంది.
బీటీ (Bt) పత్తికి నిరోధకత రావడం, గులాబీ రంగు పురుగుల బెడద (Infestation) పెరగడం ఒక పెద్ద సమస్య.
2006 నుంచి ప్రభుత్వం ఎలాంటి కొత్త జీఎం (GM) పత్తి రకాలకు ఆమోదం తెలుపలేదు.
అదనపు పొడవు ఉండే పత్తి (Extra Long Staple cotton) రకాలను రైతులు పెద్దగా సాగు చేయడం లేదు.
వాతావరణ ఒత్తిడి (Climate stress), నీటి కొరత, మార్కెట్ అనుసంధానం (Market linkages) సరిగా లేకపోవడం ప్రధాన సవాళ్లు.
ముందున్న మార్గం
తగిన బయోసేఫ్టీ తనిఖీలతో (Biosafety checks) ఆధునిక సంతానోత్పత్తి (Advanced breeding), బయోటెక్నాలజీని ప్రోత్సహించాలి.
సమగ్ర తెగుళ్ల నిర్వహణను (Integrated Pest Management) క్షేత్రస్థాయిలో విస్తృతంగా అమలు చేయాలి.
సూక్ష్మ నీటిపారుదల (Micro-irrigation) విధానాలను, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతులను (Climate-smart farming) ప్రభుత్వం ప్రోత్సహించాలి.
అదనపు పొడవు ఉండే పత్తి (ELS cotton) సాగుకు ప్రీమియం కనీస మద్దతు ధర (MSP) అందించాలి. కాంట్రాక్ట్ వ్యవసాయానికి (Contract farming) మద్దతు ఇవ్వాలి.
ఏఐ ఆధారిత (AI-based) తెగుళ్ల హెచ్చరికలు, రిమోట్ సెన్సింగ్, డిజిటల్ ట్రేసబిలిటీ (Digital traceability) టెక్నాలజీలను వాడాలి.
పత్తి క్లస్టర్లను (Cotton clusters) నేరుగా పీఎం మిత్ర (PM MITRA) టెక్స్‌టైల్ పార్కులతో అనుసంధానించాలి.
ముగింపు
పత్తి దిగుబడిని, రైతుల ఆదాయాన్ని పెంచడంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కీలకంగా మారుతుంది. ఇది వస్త్రాల నాణ్యతను పెంచుతుంది, ఎగుమతుల్లో పోటీతత్వాన్ని తీసుకువస్తుంది. మొత్తంగా ఇది భారతదేశ పత్తి రంగాన్ని పూర్తిగా మారుస్తుంది. సరైన శాస్త్రీయ ప్రణాళికతో, రైతుల భాగస్వామ్యంతో ఈ మిషన్‌ను అమలు చేస్తే మనం అద్భుతాలు సాధించవచ్చు. 2030 నాటికి ప్రపంచ స్థాయి టెక్స్‌టైల్ తయారీ హబ్‌గా (Textile manufacturing hub) మారాలన్న భారతదేశ లక్ష్యాన్ని ఇది బలోపేతం చేస్తుంది.
var elementorFrontendConfig = {"environmentMode":{"edit":false,"wpPreview":false,"isScriptDebug":false},"i18n":{"shareOnFacebook":"Share on Facebook","shareOnTwitter":"Share on Twitter","pinIt":"Pin it","download":"Download","downloadImage":"Download image","fullscreen":"Fullscreen","zoom":"Zoom","share":"Share","playVideo":"Play Video","previous":"Previous","next":"Next","close":"Close","a11yCarouselPrevSlideMessage":"Previous slide","a11yCarouselNextSlideMessage":"Next slide","a11yCarouselFirstSlideMessage":"This is the first slide","a11yCarouselLastSlideMessage":"This is the last slide","a11yCarouselPaginationBulletMessage":"Go to slide"},"is_rtl":false,"breakpoints":{"xs":0,"sm":480,"md":768,"lg":1025,"xl":1440,"xxl":1600},"responsive":{"breakpoints":{"mobile":{"label":"Mobile Portrait","value":767,"default_value":767,"direction":"max","is_enabled":true},"mobile_extra":{"label":"Mobile Landscape","value":880,"default_value":880,"direction":"max","is_enabled":false},"tablet":{"label":"Tablet Portrait","value":1024,"default_value":1024,"direction":"max","is_enabled":true},"tablet_extra":{"label":"Tablet Landscape","value":1200,"default_value":1200,"direction":"max","is_enabled":false},"laptop":{"label":"Laptop","value":1366,"default_value":1366,"direction":"max","is_enabled":false},"widescreen":{"label":"Widescreen","value":2400,"default_value":2400,"direction":"min","is_enabled":false}},"hasCustomBreakpoints":false},"version":"4.1.1","is_static":false,"experimentalFeatures":{"e_font_icon_svg":true,"additional_custom_breakpoints":true,"container":true,"e_optimized_markup":true,"theme_builder_v2":true,"e_pro_free_trial_popup":true,"nested-elements":true,"e_atomic_elements":true,"atomic_widgets_should_enforce_capabilities":true,"editor_mcp":true,"e_bc_migrations":true,"e_editor_design_system_panel":true,"e_classes":true,"global_classes_should_enforce_capabilities":true,"e_variables":true,"e_variables_manager":true,"e_opt_in_v4_page":true,"e_opt_in_v4":true,"e_components":true,"e_interactions":true,"e_widget_creation":true,"import-export-customization":true,"e_pro_atomic_form":true,"mega-menu":true,"e_pro_variables":true,"e_pro_interactions":true},"urls":{"assets":"https:\/\/telugu.kpiasacademy.com\/wp-content\/plugins\/elementor\/assets\/","ajaxurl":"https:\/\/telugu.kpiasacademy.com\/wp-admin\/admin-ajax.php","uploadUrl":"https:\/\/telugu.kpiasacademy.com\/wp-content\/uploads"},"nonces":{"floatingButtonsClickTracking":"b428c9606e","atomicFormsSendForm":"e6b2ded2ab"},"swiperClass":"swiper","settings":{"page":[],"editorPreferences":[]},"kit":{"active_breakpoints":["viewport_mobile","viewport_tablet"],"global_image_lightbox":"yes","lightbox_enable_counter":"yes","lightbox_enable_fullscreen":"yes","lightbox_enable_zoom":"yes","lightbox_enable_share":"yes","lightbox_title_src":"title","lightbox_description_src":"description"},"post":{"id":3641,"title":"%E0%B0%8E%E0%B0%B2%E0%B1%8D%20%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8B%20%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B5%E0%B0%B0%E0%B0%A3%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%20UPSC%20%E0%B0%AE%E0%B1%86%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%20%7C%20KPIAS%20Academy","excerpt":"","featuredImage":"https:\/\/telugu.kpiasacademy.com\/wp-content\/uploads\/2026\/05\/kpias-academy-6-1024x511.webp"}};
//# sourceURL=elementor-frontend-js-before
window.dFlipLocation = 'https://telugu.kpiasacademy.com/wp-content/plugins/3d-flipbook-dflip-lite/assets/';
window.dFlipWPGlobal = {"text":{"toggleSound":"Turn on\/off Sound","toggleThumbnails":"Toggle Thumbnails","toggleOutline":"Toggle Outline\/Bookmark","previousPage":"Previous Page","nextPage":"Next Page","toggleFullscreen":"Toggle Fullscreen","zoomIn":"Zoom In","zoomOut":"Zoom Out","toggleHelp":"Toggle Help","singlePageMode":"Single Page Mode","doublePageMode":"Double Page Mode","downloadPDFFile":"Download PDF File","gotoFirstPage":"Goto First Page","gotoLastPage":"Goto Last Page","share":"Share","mailSubject":"I wanted you to see this FlipBook","mailBody":"Check out this site {{url}}","loading":"DearFlip: Loading "},"viewerType":"flipbook","moreControls":"download,pageMode,startPage,endPage,sound","hideControls":"","scrollWheel":"false","backgroundColor":"#777","backgroundImage":"","height":"auto","paddingLeft":"20","paddingRight":"20","controlsPosition":"bottom","duration":800,"soundEnable":"true","enableDownload":"true","showSearchControl":"false","showPrintControl":"false","enableAnnotation":false,"enableAnalytics":"false","webgl":"true","hard":"none","maxTextureSize":"1600","rangeChunkSize":"524288","zoomRatio":1.5,"stiffness":3,"pageMode":"0","singlePageMode":"0","pageSize":"0","autoPlay":"false","autoPlayDuration":5000,"autoPlayStart":"false","linkTarget":"2","sharePrefix":"flipbook-"};
document.addEventListener("click", function(e) {
let link = e.target.closest(".elementskit-megamenu-panel a");
if (link) {
e.preventDefault();
window.location.href = link.href;
}
});