యూపీఎస్సీ మెయిన్స్ (UPSC CARE MAINS)
- ప్రశ్న: నాణ్యత లేని ఎరువుల సమస్య భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదక నియంత్రణలోని వ్యవస్థాగత బలహీనతలను హైలైట్ చేస్తుంది. రైతులు, ఆహార భద్రతపై దీని ప్రభావాలను పరిశీలించండి. అలాగే, నాణ్యతా నియంత్రణ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించండి. (15 మార్కులు)
- ప్రశ్న: భారతదేశ ఇంధన వ్యూహం పునరుత్పాదక ఇంధన విస్తరణ, అలాగే బొగ్గుపై కొనసాగుతున్న ఆధారపడటం మధ్య ఉన్న సమతుల్యతను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఎల్ నినో వంటి వాతావరణ మార్పుల సమయంలో ఇంధన భద్రతను నిర్ధారించడంలో సౌరశక్తి, బొగ్గు పాత్రను పరిశీలించండి. (15 మార్కులు)
ప్రశ్న: నాణ్యత లేని ఎరువుల సమస్య భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదక నియంత్రణలోని వ్యవస్థాగత బలహీనతలను హైలైట్ చేస్తుంది. రైతులు, ఆహార భద్రతపై దీని ప్రభావాలను పరిశీలించండి. అలాగే, నాణ్యతా నియంత్రణ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించండి. (15 మార్కులు)
Q. The issue of substandard fertilisers highlights systemic weaknesses in agricultural input regulation in India. Examine its implications for farmers and food security, and suggest measures to strengthen quality control mechanisms. (15 M)
(జనరల్ స్టడీస్ పేపర్ III – వ్యవసాయం | ఆహార భద్రత | ఇన్‌పుట్ రెగ్యులేషన్)
కవర్ చేసిన అంశాలు
ఎరువుల నాణ్యత, ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు (Fertiliser Control Order) 1985, నేల ఆరోగ్యం (Soil Health), వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత, నియంత్రణ యంత్రాంగాలు (Regulatory Mechanisms).
పరిచయం
ఇటీవల రబీ సీజన్‌లో (Rabi season) మధ్యప్రదేశ్‌లోని విదిశా (Vidisha) లో నాణ్యత లేని ఎరువులను గుర్తించారు. ఇది భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకాలను (Agricultural inputs) నియంత్రించే యంత్రాంగాల సమర్థతపై తీవ్రమైన ఆందోళనలను రేకెత్తించింది. పంట దిగుబడిలో ఎరువులు అత్యంత కీలకమైనవి. కాబట్టి వాటి నాణ్యతలో ఏమాత్రం రాజీ పడినా.. అది నేరుగా రైతుల జీవనోపాధిని, జాతీయ ఆహార భద్రతను (National food security) దెబ్బతీస్తుంది.
ప్రధాన భాగం
1. సమస్య స్వభావం: నాణ్యత లేని ఎరువులు (Substandard Fertilisers)
- డీఏపీ (DAP), ఏపీఎస్ (APS), టీఎస్‌పీ (TSP) లాంటి ఎరువుల్లో నిర్దేశించిన ప్రమాణాల కంటే తక్కువ పోషకాలు (Nutrient deficiencies) ఉన్నట్లు కనుగొన్నారు.
- ఈ ఎరువులు ఎరువుల నియంత్రణ ఉత్తర్వులు (FCO) 1985 ప్రకారం నిర్దేశించిన స్పెసిఫికేషన్‌లను చేరుకోవడంలో విఫలమయ్యాయి.
- విత్తనాలు నాటే దశలో (Sowing stage) ఈ సమస్యను గుర్తించారు. పంట సరిగ్గా ఎదగాలంటే ఆ దశలో పోషకాలు చాలా ముఖ్యం.
- అధికారులు వీటి అమ్మకాలను నిలిపివేసి, తదుపరి పరీక్షలను ప్రారంభించారు. ఇది నియంత్రణపరమైన లోపాలను (Regulatory lapses) సూచిస్తుంది.
2. రైతులు, ఆహార భద్రతపై ప్రభావాలు
- పంట దిగుబడి తగ్గడం: సరైన పోషకాలు లేకపోవడం వల్ల విత్తనాలు సరిగ్గా మొలకెత్తవు. వేరు వ్యవస్థ (Root development) బలహీనపడుతుంది. దిగుబడి తగ్గుతుంది.
- ఆర్థిక నష్టాలు: నాణ్యత లేని ఎరువుల వల్ల రైతులు ఆర్థిక నష్టాలను చవిచూస్తారు. పోషకాల కోసం అదనంగా ఎరువులు వేయాల్సి వస్తుంది.
- నేల ఆరోగ్యం దెబ్బతినడం (Soil Health Degradation): పోషకాలు అసమతుల్యంగా అందడం వల్ల దీర్ఘకాలికంగా నేల సారం దెబ్బతింటుంది.
- పెరిగే పెట్టుబడి ఖర్చులు: రైతులు పోషకాల లోపాన్ని భర్తీ చేయడానికి మోతాదుకు మించి (Overusing) ఎరువులను వాడతారు. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు (Production costs) పెరుగుతాయి.
- ఆహార భద్రతకు ముప్పు (Food Security Risk): పంట దిగుబడి తగ్గితే, అది మొత్తం వ్యవసాయ ఉత్పత్తిపై, అలాగే ఆహార సరఫరా స్థిరత్వం (Food supply stability) పై ప్రభావం చూపుతుంది.
- నమ్మకం కోల్పోవడం: నాణ్యత పదే పదే విఫలమైతే ప్రభుత్వ సంస్థలు, ఎరువుల సరఫరా వ్యవస్థలపై (Input supply systems) రైతులకు నమ్మకం సన్నగిల్లుతుంది.
3. ఎరువుల నియంత్రణలో వ్యవస్థాగత సమస్యలు
- బలహీనమైన అమలు (Weak Enforcement): క్షేత్రస్థాయిలో తనిఖీలు (Inspections), పర్యవేక్షణ సామర్థ్యం పరిమితంగా ఉన్నాయి.
- మౌలిక సదుపాయాల కొరత (Testing Infrastructure Gaps): ప్రయోగశాలలపై (Laboratories) భారం ఎక్కువగా ఉండటం వల్ల నాణ్యత లేని ఎరువులను సకాలంలో గుర్తించలేకపోతున్నారు.
- సరఫరా గొలుసులో సమస్యలు (Supply Chain Issues): ఎరువులను నిల్వ ఉంచే, రవాణా చేసే పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల వాటి నాణ్యత దెబ్బతింటోంది.
- కల్తీ, నకిలీ ఎరువులు (Adulteration and Counterfeiting): అనధికార మార్కెట్లలో (Informal markets) నకిలీ ఎరువుల బెడద ఎక్కువగా ఉంది.
- నియంత్రణలో లొసుగులు: కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య సమన్వయం (Coordination) లోపించింది.
4. వ్యవసాయంలో ఎరువుల నాణ్యత ప్రాముఖ్యత
- పంటకు సమతుల్యంగా (Balanced) పోషకాలు అందడానికి, పంట ఏపుగా పెరగడానికి ఎరువులు చాలా ముఖ్యం.
- అధిక-నాణ్యత కలిగిన ఎరువులు దిగుబడిని, నేల సారాన్ని, సుస్థిరతను (Sustainability) పెంచుతాయి.
- భారతదేశ ఆహార భద్రత, హరిత విప్లవం (Green Revolution) నమూనాకు ఇవి అత్యంత కీలకం.
- నాణ్యత లేని ఎరువులు పోషకాల సమతుల్యతను దెబ్బతీస్తాయి. వ్యవసాయ పద్ధతుల సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
5. ముందున్న మార్గం (Way Forward)
- క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించిన (Violations) వారికి కఠినమైన శిక్షలు విధించి, నియంత్రణను బలోపేతం చేయాలి.
- ఎరువులను సకాలంలో పరీక్షించడానికి.. ప్రయోగశాలల సంఖ్యను పెంచాలి. అలాగే వాటిని ఆధునికీకరించాలి (Modernize).
- ఎరువుల పంపిణీలో పారదర్శకత (Transparency) కోసం డిజిటల్ ట్రాకింగ్ సిస్టమ్‌లను (Digital tracking systems) అమలు చేయాలి.
- ఎరువుల నాణ్యత, అలాగే ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాలపై (Grievance mechanisms) రైతులకు అవగాహన కల్పించాలి.
- బయో (Bio), నానో-ఎరువులతో (Nano-fertilisers) సహా.. సమతుల్య పోషక నిర్వహణను (Balanced nutrient management) ప్రోత్సహించాలి.
- సమర్థవంతమైన నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచాలి.
ముగింపు
భారతదేశ ఎరువుల నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌లో ఉన్న కీలకమైన లోపాలను విదిశా ఉదంతం నొక్కి చెబుతోంది. రైతుల ఆదాయాన్ని (Farmer incomes) రక్షించడానికే కాకుండా, ఆహార భద్రతను (Food security) నిలబెట్టడానికి వ్యవసాయ ఉత్పాదకాల (Agricultural inputs) నాణ్యతను నిర్ధారించడం చాలా అవసరం. కఠిన నియంత్రణను అమలు చేయడం, సంస్థాగత సామర్థ్యాన్ని (Institutional capacity) మెరుగుపరచడం, శాస్త్రీయ పోషక నిర్వహణను ప్రోత్సహించడమే సుస్థిరమైన వ్యవసాయ వ్యవస్థను (Resilient agricultural system) నిర్మించడానికి కీలకం.
ప్రశ్న: భారతదేశ ఇంధన వ్యూహం పునరుత్పాదక ఇంధన విస్తరణ, అలాగే బొగ్గుపై కొనసాగుతున్న ఆధారపడటం మధ్య ఉన్న సమతుల్యతను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా ఎల్ నినో వంటి వాతావరణ మార్పుల సమయంలో ఇంధన భద్రతను నిర్ధారించడంలో సౌరశక్తి, బొగ్గు పాత్రను పరిశీలించండి. (15 మార్కులు)
Q. India’s energy strategy reflects a balance between renewable expansion and continued reliance on coal. Examine the role of solar energy and coal in ensuring energy security, especially under climate variability such as El Niño. (15 M)
(జనరల్ స్టడీస్ పేపర్ III – ఇంధనం | పర్యావరణం | వాతావరణ మార్పు)
కవర్ చేసిన అంశాలు
ఎల్ నినో (El Niño), ఇంధన భద్రత (Energy Security), సౌరశక్తి (Solar Energy), బొగ్గుపై ఆధారపడటం, గ్రిడ్ స్థిరత్వం (Grid Stability), పునరుత్పాదక ఇంధన కోత (Renewable Curtailment), వాతావరణ మార్పులు (Climate Variability).
పరిచయం
భారతదేశంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఎల్ నినో (El Niño) వంటి వాతావరణ మార్పుల వల్ల ఇది మరింత తీవ్రమవుతోంది. ఎల్ నినో వల్ల రుతుపవనాలు (Monsoons) బలహీనపడతాయి. దీనివల్ల చల్లదనం (Cooling), నీటిపారుదల (Irrigation) అవసరాలు పెరుగుతాయి. దేశంలో అంతరాయం లేని విద్యుత్ సరఫరాను అందించడానికి భారతదేశం ద్వంద్వ వ్యూహాన్ని (Dual strategy) అవలంబిస్తోంది. దీనిలో భాగంగా ప్రభుత్వం సౌరశక్తి సామర్థ్యాన్ని (Solar capacity) పెంచుతోంది. అదే సమయంలో, బొగ్గు ఆధారిత బేస్-లోడ్ విద్యుత్‌ను (Base-load power) కూడా కొనసాగిస్తోంది.
ప్రధాన భాగం
1. భారతదేశ ఇంధన డిమాండ్, వాతావరణ నేపథ్యం
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పట్టణీకరణ (Urbanisation), పారిశ్రామిక వృద్ధి వల్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకుంది.
- ఎల్ నినో పరిస్థితులు రుతుపవనాలను బలహీనపరుస్తాయి. దీనివల్ల నీటిపారుదల, విద్యుత్ వినియోగంపై ఆధారపడటం పెరుగుతుంది.
- ఇది ఇంధన వ్యవస్థపై (Energy system) తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల విశ్వసనీయత (Reliability), సుస్థిరత (Sustainability) రెండింటినీ కాపాడటం చాలా అవసరం.
2. ఇంధన భద్రతను నిర్ధారించడంలో బొగ్గు పాత్ర
- రోజంతా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి స్థిరమైన, నిరంతర బేస్-లోడ్ విద్యుత్ (Base-load power) అవసరం. ఈ విద్యుత్‌ను బొగ్గు అందిస్తుంది.
- ఇది గ్రిడ్ స్థిరత్వానికి (Grid stability) మద్దతు ఇస్తుంది. గరిష్ట డిమాండ్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా బొగ్గు విద్యుత్ ఉత్పత్తిని సులభంగా పెంచుకోవచ్చు.
- భారతదేశంలో భారీ స్థాయిలో దేశీయ బొగ్గు నిల్వలు (Domestic coal reserves) ఉన్నాయి. ఇవి ఇంధన భద్రతను పెంచుతాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని (Import dependence) తగ్గిస్తాయి.
- బొగ్గు చాలా చౌకైనది (Cost-effective). ఉక్కు (Steel), సిమెంట్ వంటి ప్రధాన పరిశ్రమలకు (Core industries) ఇది బాగా మద్దతు ఇస్తుంది.
- రుతుపవనాలు బలహీనంగా ఉన్నప్పుడు జలవిద్యుత్ (Hydropower) ఉత్పత్తి తగ్గుతుంది. ఆ సమయంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌పై ఆధారపడటం పెరుగుతుంది.
3. ఇంధన మార్పులో (Energy Transition) సౌరశక్తి పాత్ర
- భారతదేశపు స్వచ్ఛమైన ఇంధన మార్పునకు (Clean energy transition), ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలకు (Emission reduction goals) సౌరశక్తి ఎంతగానో సహాయపడుతుంది.
- ఇది పగటిపూట విద్యుత్ డిమాండ్‌ను చాలా సమర్థవంతంగా తీరుస్తుంది. ముఖ్యంగా ఏసీలు, కూలర్లు వాడే సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది.
- ఇటీవల కాలంలో సౌరశక్తి సామర్థ్యాన్ని (Capacity expansion) వేగంగా పెంచుతున్నారు. దీని వెనుక ప్రభుత్వాల బలమైన విధానపరమైన మద్దతు (Policy push) ఉందని మనం అర్థం చేసుకోవచ్చు.
- సౌరశక్తి వల్ల శిలాజ ఇంధనాలపై (Fossil fuels) ఆధారపడటం తగ్గుతుంది. ఇది వాతావరణ లక్ష్యాలను (Climate commitments) చేరుకోవడానికి మద్దతు ఇస్తుంది.
- భారతదేశ ఇంధన మిశ్రమాన్ని (Energy mix) వైవిధ్యపరచడంలో (Diversifying) ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
4. పునరుత్పాదక ఇంధన అనుసంధానంలో (Integration) సవాళ్లు
- అస్థిరత (Intermittency): సౌరశక్తి కేవలం పగటిపూట మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- నిల్వ సమస్యలు (Storage Constraints): భారీ స్థాయిలో బ్యాటరీ వ్యవస్థలు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో దీని వినియోగం కష్టంగా మారుతోంది.
- గ్రిడ్ అస్థిరత (Grid Instability): పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో వచ్చే హెచ్చుతగ్గులు ఫ్రీక్వెన్సీని, విద్యుత్ సరఫరా సమతుల్యతను (Supply balance) ప్రభావితం చేస్తాయి.
- ప్రసార అంతరాలు (Transmission Gaps): పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి కేంద్రాలు (Renewable energy sites) సాధారణంగా డిమాండ్ ఉన్న ప్రాంతాలకు చాలా దూరంగా ఉంటాయి.
- కాలానుగుణ మార్పులు (Seasonal Variability): వాతావరణ పరిస్థితులు, రుతువుల ఆధారంగా విద్యుత్ ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఉంటాయి.
5. పునరుత్పాదక ఇంధన కోత (Renewable Curtailment) భావన
- పునరుత్పాదక విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ, దాన్ని వాడుకోకుండా నిలిపివేయడాన్ని పునరుత్పాదక ఇంధన కోత (Renewable curtailment) అంటారు.
- విద్యుత్ సరఫరా ఎక్కువగా ఉండటం, ప్రసార మౌలిక సదుపాయాలు (Transmission infrastructure) లేకపోవడం, గ్రిడ్ పరిమితుల వల్ల అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటారు.
- దీనివల్ల స్వచ్ఛమైన ఇంధనం (Clean energy) వృథా అవుతుంది. వ్యవస్థలో ఉన్న లోపాలను ఇది ఎత్తిచూపుతుంది.
6. ద్వంద్వ ఇంధన వ్యూహం (Dual Energy Strategy) ప్రాముఖ్యత
- తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా అంతరాయం లేని విద్యుత్ సరఫరాను ఇది నిర్ధారిస్తుంది.
- పర్యావరణ సుస్థిరత (Environmental sustainability), ఆర్థిక వృద్ధి, పారిశ్రామిక అవసరాల మధ్య ఇది సమతుల్యత (Balance) పాటిస్తుంది.
- శిలాజ ఇంధనాలను అకస్మాత్తుగా ఆపేయకుండా, ఇదొక ఆచరణాత్మకమైన మార్పు వ్యూహాన్ని (Pragmatic transition strategy) ప్రతిబింబిస్తుంది.
- వాతావరణ మార్పులు, ప్రపంచ ఇంధన సంక్షోభాలను (Global energy shocks) తట్టుకునే సామర్థ్యాన్ని ఇది పెంచుతుంది.
7. ముందున్న మార్గం (Way Forward)
- పునరుత్పాదక ఇంధనాన్ని మెరుగ్గా వాడుకోవడానికి భారీ స్థాయిలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్‌ను (Battery energy storage systems) అభివృద్ధి చేయాలి.
- గ్రీన్ ఎనర్జీ కారిడార్ (Green Energy Corridor) ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌లను (Transmission networks) బలోపేతం చేయాలి.
- సౌర, పవన విద్యుత్, స్టోరేజ్ (నిల్వ) తో కూడిన హైబ్రిడ్ వ్యవస్థలను (Hybrid systems) ప్రోత్సహించాలి.
- స్మార్ట్ టెక్నాలజీలు, వాతావరణ అంచనా సాధనాలను (Forecasting tools) ఉపయోగించి గ్రిడ్ సరళతను (Grid flexibility) మెరుగుపరచాలి.
- ఇంధన భద్రతను నిర్ధారిస్తూనే, బొగ్గుపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించాలి.
- పునరుత్పాదక విద్యుత్ లభ్యతకు అనుగుణంగా వినియోగాన్ని మార్చుకోవడానికి, డిమాండ్-సైడ్ మేనేజ్‌మెంట్‌ను (Demand-side management) ప్రోత్సహించాలి.
ముగింపు
భారతదేశ ఇంధన మార్పు (Energy transition) సుస్థిరత (Sustainability), విశ్వసనీయత (Reliability) మధ్య ఉన్న జాగ్రత్తైన సమతుల్యతను చూపుతుంది. సౌరశక్తి వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడటంలో బొగ్గు ఇంకా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఎల్ నినో లాంటి వాతావరణ అనిశ్చితి (Climate uncertainties) సమయాల్లో గరిష్ట డిమాండ్‌ను తీర్చడంలో బొగ్గు చాలా కీలకం. ఇంధన భద్రతలో రాజీ పడకుండా, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రాథమిక వనరుగా (Primary source) మార్చాలి. ఇందుకోసం నిల్వ (Storage), మౌలిక సదుపాయాల (Infrastructure) సవాళ్లను సమర్థవంతంగా అధిగమించాలి. అప్పుడే భారతదేశ ఇంధన ప్రయాణం విజయవంతం అవుతుంది.



