var breakpoints = [{"label":"Desktop","slug":"Desktop","value":"base","direction":"max","isActive":true,"isRequired":true},{"label":"Tablet","slug":"Tablet","value":"1024","direction":"max","isActive":true,"isRequired":true},{"label":"Mobile","slug":"Mobile","value":"767","direction":"max","isActive":true,"isRequired":true}];
ప్రశ్న:భారతదేశ విదేశీ రంగం ఎదుర్కొంటున్న ముప్పుల గురించి ప్రధానమంత్రి ఇటీవల చేసిన ‘పొదుపు’ (Austerity) పిలుపు ప్రతిబింబిస్తోంది. బంగారం దిగుమతులు, ముడి చమురుపై ఆధారపడటం, విదేశీ ప్రయాణ ఖర్చులు, నిత్యావసర దిగుమతుల నేపథ్యంలో దీనిని చర్చించండి.
Q. Prime Minister’s recent austerity call reflects concerns over India’s external sector vulnerability. Discuss in the context of gold imports, crude oil dependence, foreign travel outflows and essential imports.
(జనరల్ స్టడీస్ పేపర్ III: భారత ఆర్థిక వ్యవస్థ, విదేశీ రంగం (External Sector), ఇంధన భద్రత (Energy Security))
పరిచయం
విదేశీ మారక నిల్వలు (Forex reserves) తగ్గడం, ముడి చమురు (Crude oil) ధరలు పెరగడం, బంగారం దిగుమతులు అధికమవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు (FIIs) తరలిపోవడం, విదేశీ ప్రయాణాలకు విపరీతంగా ఖర్చు చేయడం వల్ల భారతదేశ విదేశీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, అత్యవసరం కాని విదేశీ మారకద్రవ్య వ్యయాలను తగ్గించుకుని, స్వయం సమృద్ధికి (Self-reliance) మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి పౌరులను కోరారు.
ప్రధాన భాగం
ఒత్తిడికి ప్రధాన కారణాలు (Major Sources of Pressure)
బంగారం దిగుమతులు: 2025–26లో బంగారం దిగుమతులు దాదాపు $72 బిలియన్లకు చేరాయి. భారతదేశం తన అవసరాలకు సరిపడా బంగారాన్ని ఎక్కువగా దిగుమతే చేసుకుంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి, కరెంట్ అకౌంట్ లోటు (Current Account Deficit – CAD) పెరుగుతుంది.
ముడి చమురుపై ఆధారపడటం: మన దేశ చమురు అవసరాల్లో దాదాపు 89% దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. పశ్చిమాసియా (West Asia) వివాదాల కారణంగా చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరుగుతాయి. రూపాయి విలువ పడిపోతుంది. అలాగే ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు మరో ప్రధాన ముప్పు.
విదేశీ ప్రయాణాలు (Foreign travel): లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద విదేశీ ప్రయాణాల కోసం చేసే ఖర్చులు కూడా విదేశీ మారక నిల్వలపై భారం పెంచుతున్నాయి. విదేశీ విహారయాత్రలు, విదేశాల్లో వివాహాలు చేసుకోవడం వల్ల ఈ భారం (Outflows) మరింత పెరుగుతోంది.
నిత్యావసర దిగుమతులు (Essential imports): వంటనూనెలు (Edible oils), ఎరువులు కూడా మన విదేశీ రంగానికి ముప్పుగా మారాయి. వంటనూనెలు మన రోజువారీ అవసరం కాగా, ఎరువులు వ్యవసాయం, ఆహార ధరలతో ముడిపడి ఉంటాయి. పశ్చిమాసియాలో అవాంతరాలు వస్తే, దేశీయంగా ఉత్పత్తి చేయడానికి అవసరమైన ఎరువుల దిగుమతులు, అలాగే ఎల్ఎన్‌జీ (LNG) సరఫరాలపై ప్రభావం పడుతుంది.
పొదుపు పిలుపు ప్రాముఖ్యత (Significance of the Austerity Call)
ప్రధానమంత్రి పిలుపు.. బాధ్యతాయుతమైన వినియోగాన్ని (Responsible consumption), విదేశీ మారక ద్రవ్య నిల్వల సంరక్షణను, స్వయం సమృద్ధిని ప్రోత్సహిస్తుంది. ప్రజా రవాణా (Public transport), ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వాడకాన్ని పెంచడం, వర్క్ ఫ్రమ్ హోమ్ (Work-from-home), బంగారు ఆభరణాల కొనుగోలును వాయిదా వేసుకోవడం, వంటనూనెల వాడకాన్ని తగ్గించడం, ప్రకృతి వ్యవసాయాన్ని (Natural farming) ప్రోత్సహించడం వంటి చర్యల ద్వారా దిగుమతులపై ఒత్తిడిని తగ్గించవచ్చు.
ముందున్న మార్గం (Way Forward)
భారతదేశం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను (Gold Monetisation Scheme) ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. అత్యవసరం కాని విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలి. దేశీయ ఉత్పత్తిని పెంచుకోవాలి. ఎరువులను సమతుల్యంగా వాడేలా చూడాలి. అలాగే విదేశీ పర్యాటకులను మన దేశానికి ఆకర్షించేలా (Inbound tourism) చర్యలు చేపట్టాలి. పౌరుల జీవనశైలి మార్పులతో (Citizen behaviour) పాటు ప్రభుత్వ విధానపరమైన సంస్కరణలు (Structural reforms) కూడా తోడు కావాలి.
ముగింపు
భారతదేశ విదేశీ రంగం ఎదుర్కొంటున్న ముప్పు.. కేవలం ప్రపంచ పరిణామాలతో మాత్రమే కాకుండా, మన దేశ ప్రజల వినియోగ విధానాలతో (Domestic consumption patterns) కూడా ముడిపడి ఉంది. పౌరుల పొదుపు (Citizen austerity), దేశీయ సామర్థ్య పెంపు (Capacity-building), స్వయం సమృద్ధితో కూడిన కలయికే మన విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని (Macroeconomic stability) బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
ప్రశ్న:గ్రామీణ కనెక్టివిటీకి భౌతిక ప్రాప్యతను సామాజిక, ఆర్థిక అవకాశాలుగా మార్చే సామర్థ్యం ఉంది. సమ్మిళిత గ్రామీణ అభివృద్ధిని ప్రోత్సహించడంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన (PMGSY) పాత్రను పరిశీలించండి. వెనుకబడిన, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మారుమూల కనెక్టివిటీని (Last-mile connectivity) పీఎంజీఎస్‌వై-IV (PMGSY-IV) ఎలా బలోపేతం చేస్తుంది?
Q. Rural connectivity has the potential to transform physical access into social and economic opportunity. Examine the role of Pradhan Mantri Gram Sadak Yojana in promoting inclusive rural development. How can PMGSY-IV strengthen last-mile connectivity in vulnerable and backward regions?
(జనరల్ స్టడీస్ పేపర్ II – పాలన, సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం)
పరిచయం
గ్రామీణ కనెక్టివిటీ అంటే కేవలం రోడ్లు నిర్మించడమే కాదు. ఇది భౌతిక ప్రాప్యతను (Physical access) సామాజిక, ఆర్థిక అవకాశాలుగా మారుస్తుంది. రోడ్డు సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాలకు అన్ని కాలాల్లోనూ (All-weather) ఉపయోగపడే రోడ్డు కనెక్టివిటీని అందించడానికి ‘ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన’ (PMGSY) ను 2000 సంవత్సరంలో ఒక కేంద్ర ప్రాయోజిత పథకంగా (Centrally Sponsored Scheme) ప్రారంభించారు. ఈ పథకం 25 ఏళ్ల ప్రయాణం.. గ్రామీణ పరివర్తనలో (Rural transformation) రోడ్ల పాత్రను స్పష్టం చేస్తోంది.
ప్రధాన భాగం
పీఎంజీఎస్‌వై (PMGSY), సమ్మిళిత గ్రామీణాభివృద్ధి
1. ప్రాథమిక సేవలకు అందుబాటు (Access to Basic Services):
పీఎంజీఎస్‌వై గ్రామాలను పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్లు, ఉపాధి కేంద్రాలు, ప్రజా సేవలతో (Public services) అనుసంధానిస్తుంది. ఇది విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు, మారుమూల కమ్యూనిటీలకు (Remote communities) ఇది ఎంతో మేలు చేస్తుంది.
2. గ్రామీణ ఆర్థిక ఏకీకరణ (Rural Economic Integration):
మెరుగైన గ్రామీణ రహదారులు రైతులు వ్యవసాయ మార్కెట్లకు (Agricultural markets) సులభంగా చేరుకోవడానికి సహాయపడతాయి. ఇది రవాణా ఇబ్బందులను తగ్గిస్తుంది, మార్కెట్లకు సులువుగా చేరుకునేలా (Market access) చేస్తుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
3. సంక్షేమ ఫలాల పంపిణీ, అత్యవసర సేవలు:
గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాల అమలును (Delivery of government schemes), అత్యవసర వైద్య సేవలను (Emergency medical services), పాలనాపరమైన సేవలను ఈ రోడ్డు కనెక్టివిటీ మెరుగుపరుస్తుంది.
4. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా, అభివృద్ధి:
వామపక్ష తీవ్రవాద (LWE) ప్రభావిత ప్రాంతాల్లో, రోడ్డు కనెక్టివిటీ అనేది భద్రతా బలగాల కదలికలకు (Security mobility), అలాగే సామాజిక-ఆర్థిక అభివృద్ధికి (Socio-economic development) సహాయపడుతుంది. మారుమూల ప్రాంతాలను ప్రధాన స్రవంతి అభివృద్ధిలో (Mainstream development) భాగస్వామ్యం చేయడానికి ఇది సహాయపడుతుంది.
1. అనుసంధానం లేని ఆవాసాలకు కనెక్టివిటీ (Connecting Unconnected Habitations):
పీఎంజీఎస్‌వై-IV అనేది 2024–25 నుంచి 2028–29 వరకు అమలవుతుంది. రోడ్డు సదుపాయం లేని 25,000 గ్రామీణ ఆవాసాలకు (Rural habitations) కనెక్టివిటీ కల్పించడం దీని లక్ష్యం. దీనికోసం ₹70,125 కోట్ల వ్యయంతో 62,500 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను నిర్మించాలని ప్రతిపాదించారు.
2. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై (Vulnerable Regions) దృష్టి:
గిరిజన ప్రాంతాలు, ఆస్పిరేషనల్ జిల్లాలు, బ్లాక్‌లు (Aspirational Districts and Blocks), ఎడారి ప్రాంతాలు (Desert areas), ఈశాన్య (North-Eastern), హిమాలయ ప్రాంతాలపై (Himalayan regions) పీఎంజీఎస్‌వై-IV ప్రత్యేక దృష్టి పెట్టింది.
3. గిరిజన పథకాలతో అనుసంధానం (Convergence):
పీఎం-జన్‌మన్ (PM-JANMAN), ధరితీ ఆబా జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan) లాంటి పథకాలతో పీఎంజీఎస్‌వైని అనుసంధానించడం వల్ల.. గిరిజన, వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది.
4. సాంకేతికత, సుస్థిరత (Technology and Sustainability):
ఓఎంఎంఏఎస్ (OMMAS), ఈ-మార్గ్ (e-MARG), జీపీఎస్ ట్రాకింగ్ (GPS tracking), పీఎం గతి శక్తి (PM Gati Shakti) పోర్టల్, పీఎంజీఎస్‌వై (PMGSY) గ్రామ సడక్ సర్వే యాప్ లాంటి వాటి ఉపయోగం వల్ల.. ప్రణాళిక, పర్యవేక్షణ, నిర్వహణ (Maintenance) మెరుగుపడతాయి. వేస్ట్ ప్లాస్టిక్, ఫ్లై యాష్ (Fly ash), కోల్డ్ మిక్స్ టెక్నాలజీ (Cold mix technology), బయో-ఇంజనీరింగ్ (Bio-engineering) లాంటి గ్రీన్ టెక్నాలజీల వినియోగం వల్ల గ్రామీణ రహదారులు మరింత మన్నికగా (Sustainable) ఉంటాయి.
ముగింపు
పీఎంజీఎస్‌వై పథకం గ్రామీణ రహదారులను శ్రేయస్సు (Prosperity), గౌరవం (Dignity), సమ్మిళిత అభివృద్ధికి (Inclusion) మార్గాలుగా మార్చింది. మారుమూల కనెక్టివిటీ (Last-mile connectivity) కి సాంకేతికత, సుస్థిరత (Sustainability), సమస్యాత్మక ప్రాంతాలకు మద్దతు లాంటివి జోడించడం ద్వారా పీఎంజీఎస్‌వై-IV (PMGSY-IV) ఈ ప్రభావాన్ని మరింత లోతుగా తీసుకువెళ్లగలదు.
var elementorFrontendConfig = {"environmentMode":{"edit":false,"wpPreview":false,"isScriptDebug":false},"i18n":{"shareOnFacebook":"Share on Facebook","shareOnTwitter":"Share on Twitter","pinIt":"Pin it","download":"Download","downloadImage":"Download image","fullscreen":"Fullscreen","zoom":"Zoom","share":"Share","playVideo":"Play Video","previous":"Previous","next":"Next","close":"Close","a11yCarouselPrevSlideMessage":"Previous slide","a11yCarouselNextSlideMessage":"Next slide","a11yCarouselFirstSlideMessage":"This is the first slide","a11yCarouselLastSlideMessage":"This is the last slide","a11yCarouselPaginationBulletMessage":"Go to slide"},"is_rtl":false,"breakpoints":{"xs":0,"sm":480,"md":768,"lg":1025,"xl":1440,"xxl":1600},"responsive":{"breakpoints":{"mobile":{"label":"Mobile Portrait","value":767,"default_value":767,"direction":"max","is_enabled":true},"mobile_extra":{"label":"Mobile Landscape","value":880,"default_value":880,"direction":"max","is_enabled":false},"tablet":{"label":"Tablet Portrait","value":1024,"default_value":1024,"direction":"max","is_enabled":true},"tablet_extra":{"label":"Tablet Landscape","value":1200,"default_value":1200,"direction":"max","is_enabled":false},"laptop":{"label":"Laptop","value":1366,"default_value":1366,"direction":"max","is_enabled":false},"widescreen":{"label":"Widescreen","value":2400,"default_value":2400,"direction":"min","is_enabled":false}},"hasCustomBreakpoints":false},"version":"4.1.1","is_static":false,"experimentalFeatures":{"e_font_icon_svg":true,"additional_custom_breakpoints":true,"container":true,"e_optimized_markup":true,"theme_builder_v2":true,"e_pro_free_trial_popup":true,"nested-elements":true,"e_atomic_elements":true,"atomic_widgets_should_enforce_capabilities":true,"editor_mcp":true,"e_bc_migrations":true,"e_editor_design_system_panel":true,"e_classes":true,"global_classes_should_enforce_capabilities":true,"e_variables":true,"e_variables_manager":true,"e_opt_in_v4_page":true,"e_opt_in_v4":true,"e_components":true,"e_interactions":true,"e_widget_creation":true,"import-export-customization":true,"e_pro_atomic_form":true,"mega-menu":true,"e_pro_variables":true,"e_pro_interactions":true},"urls":{"assets":"https:\/\/telugu.kpiasacademy.com\/wp-content\/plugins\/elementor\/assets\/","ajaxurl":"https:\/\/telugu.kpiasacademy.com\/wp-admin\/admin-ajax.php","uploadUrl":"https:\/\/telugu.kpiasacademy.com\/wp-content\/uploads"},"nonces":{"floatingButtonsClickTracking":"72491a2136","atomicFormsSendForm":"7d03324945"},"swiperClass":"swiper","settings":{"page":[],"editorPreferences":[]},"kit":{"active_breakpoints":["viewport_mobile","viewport_tablet"],"global_image_lightbox":"yes","lightbox_enable_counter":"yes","lightbox_enable_fullscreen":"yes","lightbox_enable_zoom":"yes","lightbox_enable_share":"yes","lightbox_title_src":"title","lightbox_description_src":"description"},"post":{"id":3938,"title":"PMGSY%20%E0%B0%B8%E0%B0%AE%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%20%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%20UPSC%20Mains%20%7C%20KPIAS%20Academy","excerpt":"","featuredImage":"https:\/\/telugu.kpiasacademy.com\/wp-content\/uploads\/2026\/05\/upsc-mains-current-affairs-13th-may-2026-kpiasacademy-1024x512.webp"}};
//# sourceURL=elementor-frontend-js-before
window.dFlipLocation = 'https://telugu.kpiasacademy.com/wp-content/plugins/3d-flipbook-dflip-lite/assets/';
window.dFlipWPGlobal = {"text":{"toggleSound":"Turn on\/off Sound","toggleThumbnails":"Toggle Thumbnails","toggleOutline":"Toggle Outline\/Bookmark","previousPage":"Previous Page","nextPage":"Next Page","toggleFullscreen":"Toggle Fullscreen","zoomIn":"Zoom In","zoomOut":"Zoom Out","toggleHelp":"Toggle Help","singlePageMode":"Single Page Mode","doublePageMode":"Double Page Mode","downloadPDFFile":"Download PDF File","gotoFirstPage":"Goto First Page","gotoLastPage":"Goto Last Page","share":"Share","mailSubject":"I wanted you to see this FlipBook","mailBody":"Check out this site {{url}}","loading":"DearFlip: Loading "},"viewerType":"flipbook","moreControls":"download,pageMode,startPage,endPage,sound","hideControls":"","scrollWheel":"false","backgroundColor":"#777","backgroundImage":"","height":"auto","paddingLeft":"20","paddingRight":"20","controlsPosition":"bottom","duration":800,"soundEnable":"true","enableDownload":"true","showSearchControl":"false","showPrintControl":"false","enableAnnotation":false,"enableAnalytics":"false","webgl":"true","hard":"none","maxTextureSize":"1600","rangeChunkSize":"524288","zoomRatio":1.5,"stiffness":3,"pageMode":"0","singlePageMode":"0","pageSize":"0","autoPlay":"false","autoPlayDuration":5000,"autoPlayStart":"false","linkTarget":"2","sharePrefix":"flipbook-"};
document.addEventListener("click", function(e) {
let link = e.target.closest(".elementskit-megamenu-panel a");
if (link) {
e.preventDefault();
window.location.href = link.href;
}
});